శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు వస్తున్న సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో మియాపూర్ లో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మియాపూర్ వాణిజ్య వ్యాపారులకు , డాక్టర్స్ , మార్వాడీ సమాజ్ వారికి , స్ట్రీట్ వ్యాపారులకు, స్థానిక ప్రజలకు సభ ఆహ్వాన పత్రికలను , వీవీఐపీ ఇన్విటేషన్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కురుమ, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ నాయకుడు రామారావు , బీజేవైఎం నాయకులు వెంకట్ , మహేష్ యాదవ్ , రాజు సింగ్ , రాకేష్ , నవీన్ , హరీష్ , ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.






