శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో రెండో వారం అన్నదాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాన్ని బోయిని మహేష్ యాదవ్ ప్రారంభించారు. అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులతోపాటు ARP టీమ్ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






