ఎల్‌బీ స్టేడియంలో కుస్తీ పోటీలు ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, మే 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): న‌గ‌రంలోని ఎల్‌బీ స్టేడియంలో భారతీయ సాంప్రదాయ కుస్తీ పోటీల‌ను రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కుస్తీ పోటీలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు ప్రతిభను, స్ఫూర్తిని, పౌరుషాన్ని ప్రదర్శించే విధంగా నిర్వహించిన ఈ పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనేకమంది నూతన యోధులను తయారు చేస్తున్న సంస్థలను, గురువులను సభాపతితో కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రతినిధులు, ప్రముఖులు, కుస్తీ యోధులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here