శేరిలింగంపల్లి, మే 8 (నమస్తే శేరిలింగంపల్లి): మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్న నరేంద్ర మోడీకి 10 డిమాండ్లతో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో బహిరంగ లేఖ రాశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలని, జనగణనలో కులగణనను చేర్చి లెక్కించాలని, బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను పునఃసమీక్షించాలని, రోహిణి కమిషన్ ను అమలుచేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయర్ రద్దుచేయాలని, ఉన్నత న్యాయస్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.






