సీఎంసీ కార్యాల‌యానికి 72 ప్ర‌జావాణి ఫిర్యాదులు

శేరిలింగంప‌ల్లి, మే 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పౌరుల నుండి విశేష స్పందన లభించింది. పౌరులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్ర‌మంలో మొత్తం 72 ఫిర్యాదులు నమోదయ్యాయి. టౌన్ ప్లానింగ్ – 41, ఇంజినీరింగ్ – 14, అర్బన్ బయోడైవర్సిటీ – 5, స్పోర్ట్స్ – 3, శానిటేషన్ – 2, రెవెన్యూ (ప్రాపర్టీ ట్యాక్స్) – 2, ఎలక్ట్రికల్ – 1, అడ్వర్టైజ్‌మెంట్ – 1, హౌసింగ్ – 1, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ – 1, ఎస్టేట్స్ – 1 వ‌చ్చిన‌ట్లు తెలిపారు. కమిషనర్ సృజ‌న ఈ సంద‌ర్భంగా సంబంధిత విభాగాధిపతులతో కలిసి ప్రతి ఫిర్యాదును సమీక్షించి, క్షేత్రస్థాయి పరిశీలన చేసి, నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here