సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

శేరిలింగంప‌ల్లి, మే 2 (నమ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్, గోకుల్ ప్లాట్స్, సుభాష్ చంద్రబోస్ నగర్, జూబ్లీ గార్డెన్ , ఇజ్జత్ నగర్, అయ్యప్ప సొసైటీ కాలనీలలో రూ.3 కోట్ల21 లక్షలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలబెడ‌తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here