శేరిలింగంపల్లి, మే 2 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీరామ్ నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులతో కలసి హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పాద యాత్ర చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. వీధి దీపాల సమస్యను కూడా వెంటనే సరిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో SFI మల్లేష్, వీధి దీపాల సూపర్వైజర్ సుధాకర్, జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.






