శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కూకట్ పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గరుడ, హనుమద్ మూర్తి స్థాపన ప్రయుక్త పాంచాంహ్నిక అష్ట కుండాత్మక శ్రీ రామాయణ మహా యజ్ఞ కార్యక్రమములో భాగంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జియర్ స్వామి ఏప్రిల్ 30 న రాత్రి రామాలయం దర్శనం చేసుకొని ప్రవచనం చేసి మే 1 చివరి రోజు తన కరకమలములచే మహా పూర్ణాహుతి , శ్రీ గరుడ హనుమద్ మూర్తుల మహా కుంభాభిషేకం , శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం, పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA మాధవరం కృష్ణారావు దంపతులు , మాజీ చైర్మన్ శ్రీనివాసరావు (తులసి రావు)దంపతులు, మాజీ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ చైర్మన్లు నైనేని తులసిరావు, గొట్టుముక్కుల పెద్ద భాస్కర్ రావు, భక్తులు పాల్గొన్నారు.






