శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): మే డే స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్ల బిల్లును తిప్పికొడదామని సిఐటియు రంగారెడ్డి జిల్లా నాయకుడు జగదీష్ అన్నారు. మే డే సందర్భంగా శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలో గచ్చిబౌలి చౌరస్తా , చందానగర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో సిఐటియు ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేసి మే డే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొడదామని అన్నారు. కార్మికుల హక్కులను కాపాడదామని, ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని, 12 గంటల పనికి వ్యతిరేకంగా పోరాడుదాం అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి కొంగర కృష్ణ , నాయకులు మాణిక్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






