ఘ‌నంగా శ్రీ గరుడ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన

శేరిలింగంప‌ల్లి, మే 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్‌పల్లి రామాలయంలో శుక్రవారం శ్రీ గరుడ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి బీఆర్‌ఎస్ నాయకుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, మారబోయిన రవి యాదవ్, గోపిరాజు శ్రీనివాస్ రావు, ఎర్రబెల్లి సతీష్ రావు, సాయి నందన్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్, గణేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంత ప్రజల శాంతి, సుభిక్షం కోసం పూజ‌లు చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here