వేస‌విలో దాహార్తిని తీర్చేందుకు చ‌లివేంద్రాల‌ను ఏర్పాటు చేయాలి: రవి కుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అలిగెరి వెంకటేష్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చందానగర్‌లోని అను ఫర్నిచర్ ఎదురుగా బుధ‌వారం నూత‌నంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని బిజెపి శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు నీళ్లు, మ‌జ్జిగ‌ను పంపిణీ చేశారు. వేస‌వి కాలంలో ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చేందుకు దాత‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు చ‌లివేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని అన్నారు. అలిగెరి అర్జున్ రావు ఆధ్వ‌ర్యంలో చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయ్, వసంత్, అఖిల్, జాన్ వెస్లీ, కళ్యాణ్, చరణ్, సాయిరాం, చైతన్య వెంకీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here