శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేలింగంపల్లి డివిజన్ లింగంపల్లి గ్రామ నాయకుడు, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, డివిజన్ అధ్యక్షుడు కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డితోపాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ మారబోయిన రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గ్రామ బొడ్రాయిని గ్రామానికి ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా భావించే పవిత్ర స్థానం అని ఆయన అన్నారు. గ్రామ బొడ్రాయి గ్రామాన్ని అంటువ్యాధులు, దుష్ట శక్తుల నుండి ప్రజలకు రక్షణ కల్పించి, గ్రామ ప్రజలకు సుఖ శాంతులను కలగజేస్తుందని ఆయన అన్నారు. గ్రామబొడ్రాయి పండుగ గ్రామ ఐక్యతకు సూచకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కిషోర్ కుమార్, సాయి విజయ్ , సోమయ్య యాదవ్, లింగం శ్రీనివాసు, రవి, కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.






