శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో జరిగిన శ్రీ నాభిశిల (బొడ్రాయి) ప్రాతిష్టాపన మహోత్సవం కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మారబోయిన రాజు యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో బొడ్రాయిని పూజించే సంప్రదాయం పూర్వీకుల నుంచి వస్తుందన్నారు. గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి అశుభాలు జరుగకుండా ఉండాలని పూర్వకాలంలో పెద్దలు బొడ్రాయిని ప్రతిష్టించే వాళ్లు అని తెలిపారు. అమ్మ వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అమ్మ వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్, అక్తర్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చింత కింది రవీందర్ గౌడ్, రవి యాదవ్, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, పవన్, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






