మహిళా ఆగ్రహ యాత్రకు త‌ర‌లిన హఫీజ్‌పేట బీజేపీ శ్రేణులు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ రాజకీయాలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో GHMC ట్యాంక్ బండ్ కార్యాలయం నుండి ఇందిరా పార్క్ వరకు నిర్వ‌హించిన మహిళా ఆగ్రహ యాత్రలో పాల్గొనేందుకు హఫీజ్ పేట్ డివిజన్ హుడా కాలనీ నుండి అధిక సంఖ్యలో బీజేపీ మహిళా నాయ‌కులు, కార్యకర్తలు త‌ర‌లి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, హఫీజ్ పేట్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు కైతాపురం జితేందర్, మాజీ కౌన్సిలర్ రమణయ్య, డివిజన్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా, బీజేపీ నాయకులు సత్యనారాయణ రాజు, పవన్ కుమార్, శ్రీనివాస్, మహిళా నాయకురాలు శోభా, నాగమణి, శాంత, పల్లవి, జ్యోతి, బాలామణి, చిన్మ‌యి, కిషోరి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here