అక్ర‌మ నిర్మాణాల‌ను సీజ్ చేయాలి: తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మక్తా మహబూబ్ పేట్ సర్వే నంబర్ 44లో పర్మిషన్ లేకుండా ఏడు ఫ్లోర్ల‌ బిల్డింగ్ లు నిర్మిస్తున్న వారిపై హైకోర్టు ఆర్డర్ మేరకు సీజింగ్ తొలగించి కట్టిన రెండు బిల్డింగ్ లను మళ్లీ సీజ్ చేసిన CMC అధికారులను అభినందిస్తున్నామ‌ని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు. ఇంకా 20 బిల్డింగులు నిర్మాణంలో ఉన్నందున పర్మిషన్ లేకుండా కట్టే బిల్డింగ్ లను తక్షణమే సీజ్ చేయాలని అన్నారు. 44 సర్వే నంబర్‌లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని 2016 లో హైకోర్టు ట్రిబ్యున‌ల్ బెంచి ఆర్డర్ ఇచ్చిన‌ప్పటికీ అక్రమ దారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఏడు ఫ్లోర్లు, ఆరు ఫ్లోర్లు 100 గజాల్లో ఏడు ఫ్లోర్లు కూడా నిర్మిస్తున్నార‌ని, నాణ్యత లేని బిల్డింగులు కడుతూ తక్కువ ధరకు అమ్మి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. క‌నుక నిర్మాణంలో ఉన్న మిగతా బిల్డింగుల‌ను కూడా సీజ్ చేయాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here