స‌ర్క‌స్ క‌ళాకారుల‌కు అట్టేపల్లి రామప్రభు స‌హాయం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఊరూరా తిరిగి సర్కస్ చేస్తూ జీవనం గడిపే కళాకారులను అట్టేపల్లి రామప్రభు ఆదుకున్నారు. వారి ఆట‌ను సందర్శించిన ఆయ‌న వారికి తక్షణ సహాయంగా 25 కిలోల బియ్యం సంచుల‌ను అందజేశారు. ఈ సందర్భంగా వారి జీవన పరిస్థితులను తెలుసుకుని వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సమాజ సేవలో భాగంగా ఇటువంటి కళాకారులకు అవసరమైన సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here