మియాపూర్ స‌ర్కిల్ ప్ర‌జావాణికి 8 ఫిర్యాదులు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని మియాపూర్ స‌ర్కిల్ కార్యాల‌యంలో సోమ‌వారం ప్ర‌జా వాణి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇందులో స‌ర్కిల్ ఉప క‌మిష‌న‌ర్ డి.శశిరేఖ స్వ‌యంగా పాల్గొని ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌ను స్వీక‌రించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 2 ఫిర్యాదులు రాగా, రెవెన్యూ విభాగంలో 1, హెల్త్ అండ్ శానిటేష‌న్‌లో 1, ఇంజినీరింగ్ విభాగంలో 4 మొత్తం క‌లిపి 8 ఫిర్యాదులు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. ఆయా ఫిర్యాదుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని సంబంధిత విభాగాల‌కు చెందిన అధికారులు, సిబ్బందికి డీసీ శ‌శిరేఖ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here