భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండ KMR ఎస్టేట్ కాలనీలో రూ.62.50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణం పనులకు జలమడలి అధికారులు, మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజ‌రై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, త‌మ‌ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణన‌లోకి తీసుకొని ప్రత్యేక చొరవతో UGD నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి, జిఎం కృష్ణ, డిజిఎం శ్రీహరి, మేనేజర్ సందీప్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కొడిచెర్ల రాములు, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, పవన్, సాయి, కేఎంఆర్ ఎస్టేట్స్ ప్రెసిడెంట్ నరసింహా రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బాబిరెడ్డి, సెక్రటరీ వేణుబాబు, గనస్యం నాగేశ్వరరావు, శ్రీహర్ష, రవికుమార్, పర్వతాలు, సుకుమార్, శ్రీనివాసరావు, గౌతమ్ శ్యామ్, ప్రమోద్, ప్రవీణ్, సుకుమార్, సత్య, అలేఖ్య, అనూష, మౌనిక, లక్ష్మి, ప్రియాంక, మల్లేష్, పవన్, సాయి, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here