శేరిలింగంపల్లి, ఏప్రిల్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొత్తగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కై లాబన్ షాప్ ను కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. అలాగే మరికొందరికి ఉపాధి కల్పించాలని, స్వయం ఉపాధి దేశాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పదిమంది యువతకు ఉపాధి కల్పించినందుకు నిర్వాహకులను అభినందించారు. యాజమానులు అస్లాం ఖాన్, అక్రమ్ ఖాన్, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.






