కుల వ్య‌వ‌స్థ‌ను రూపుమాపిన‌ప్పుడే దేశాభివృద్ధి: ఎన్. చంద్రశేఖర్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేశంలో ఉన్న అసమానతలను తొలగించడానికి వర్గ, సామాజిక జమిలి పోరాటాల బలోపేతమే మహమ్మద్ కి అర్పించే నివాళి అని యంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్. చంద్రశేఖర్ అన్నారు. యంసిపిఐ(యు) మాజీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, మహమ్మద్ గౌస్ 5వ వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి మండలంలోని మియాపూర్ ముజఫర్ అహ్మద్ నగర్ ఎంసిపిఐ (యు) తాండ్ర రామచంద్రయ్య భవన్ లో మహమ్మద్ గౌస్ చిత్రపటానికి ఎన్ చంద్రశేఖర్ పూల మాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో తరతరాలుగా దోపిడీ వ్యవస్థతోపాటు కుల, మత అణిచివేత అసమానతల వ్యవస్థ ఉందని అన్నారు. దోపిడీ, అవినీతి రహిత భారత సమాజం ఉండే విధంగా విప్లవం సాధించాలంటే మనిషి మనిషికి అడ్డుగోడలుగా ఉన్న కుల వ్యవస్థను రూపుమాపాలని, అప్పుడే సమానత్వంతో కూడిన వ్యవస్థ సాధ్యమ‌వుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కుంభం సుకన్య , వనం సుధాకర్ , రాష్ట్ర కమిటీ సభ్యులు తుడుం అనిల్ కుమార్, పల్లె మురళి, తాండ్ర కళావతి, అంగడి పుష్ప, పి.భాగ్యమ్మ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు కర్ర దానయ్య, ఇస్లావత్ దశరథ్ నాయక్, యార్లగడ్డ రాంబాబు, పి యాదగిరి, ఎస్ లక్ష్మణ్, శ్యాంసుందర్, పార్టీ సభ్యులు కే రాజు, జి శివాని, అప్సర్ బేగం, వి.రాధ, బి రవి, ఎం రాములు, ఎస్ రాజు, గురువయ్య, కే చొక్కాం, డప్పు రాజు, ఎం నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here