శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాకులో కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్, జీహెచ్ఏంసీ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలతో కలసి క్షేత్ర స్థాయిలో పర్యటించి, పలు సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ప్రేమ్ నగర్ బి బ్లాకులో కొనసాగుతున్న సివరేజ్ అవుట్ లెట్ పైప్ లైను పనులను హమీద్ పటేల్ hmws వాటర్ వర్క్స్ అధికారి సందీప్ తో కలసి పరిశీలించారు. పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులను నిర్వహించాలని కాంట్రాక్టర్ కు సూచించారు.

అనంతరం ప్రేమ్ నగర్ ఎ బ్లాకు నుండి, ప్రేమ్ నగర్ బి బ్లాకులోకి ఉన్న చిన్న ఓపెన్ నాలా సమస్యను స్థానిక నాయకులు, జీహెచ్ఏంసీ అధికారులు ఈఈ శిరీష, ఏఈ భాస్కర్ లతో కలసి పరిష్కారం దిశగా సమాలోచనలు, చర్చలు జరిపారు. యుద్ధ ప్రతిపదికన స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనుల కోసం ప్రతిపాదనలు చేయాలని ఈ సందర్బంగా అధికారులను కోరారు. కాలనీలో కట్టిన భవనాలు, పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని, ఓపెన్ నాలా విస్తీర్ణం పెంచాలని, రానున్న వర్షం కాలంలోపే పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు హమీద్ పటేల్ సూచించారు. ఈ పర్యటనలో జీహెచ్ఏంసీ అధికారులు ఈఈ శిరీష, ఏఈ భాస్కర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, వాటర్ వర్క్స్ అధికారి సందీప్, స్థానిక సీనియర్ నాయకులు ఎన్ .రూపారెడ్డి, డాక్టర్ రమేష్, గొళ్ళెం యాదగిరి, గిరి గౌడ్, వెంకటేష్ యాదవ్, అబేద్ అలీ, రాజు, రాజి రెడ్డి, సైదులు, సత్తిబాబు, మల్లేష్, కచ్చావా దీపక్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





