శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని FCI కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై CMC డిఈ శ్రీదేవి, జలమండలి DGM నారాయణ, SNDP డిఈ ధీరజ్, ఇరిగేషన్ అధికారులతో కలిసి మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేసి పలు సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ FCI కాలనీలో ఉన్న సమస్యలను స్వయంగా పర్యటించి పరిశీలించడం జరిగిందని అన్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించామని, కాలనీలో మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో CMC ఏఈ సంతోష్, ఇరిగేషన్ ఏఈ గులాం, వర్క్ ఇన్స్పెక్టర్లు జగదీష్, లింగయ్య , అన్వర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






