అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని శుభ్రం చేసిన బీజేపీ నాయ‌కులు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): డాక్టర్‌ బాబా సాహెబ్ అంబేద్కర్ 136వ జయంతి సంద‌ర్బంగా హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో చందానగర్ లోని అంబేద్కర్ విగ్రహాన్ని సోమ‌వారం శుభ్రం చేశారు. మంగ‌ళ‌వారం అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా పార్టీ ఆదేశాల మేర‌కు విగ్ర‌హంతోపాటు చుట్టు ప‌క్క‌ల స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, రంగారెడ్డి అర్బన్ జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రావు, నాయకులు పవన్ కుమార్, పి శ్రీనివాస్ , రామ్మోహన్ , బీజేవైఎం డివిజన్ ప్రధాన కార్యదర్శి బాలరాజు, బీజేపీ నాయకులు శివ , రాజేష్ , లోకేష్ , కిరణ్ , మహేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here