జ్యోతి రావు పూలే గొప్ప సామాజిక తత్త్వవేత్త: తాడిబోయిన రామస్వామి యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి సంద‌ర్బంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందాన‌గ‌ర్‌లోని న్యూ గుడ్ షెఫ‌ర్డ్ డెఫ్ అండ్ డంబ్ పాఠ‌శాల‌లో పూలే చిత్ర పటానికి అసోసియేష‌న్‌ కన్వీనర్ తాడిబోయిన‌ రామస్వామి యాదవ్ పూల మాల‌లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంత‌రం విద్యార్థులకు పండ్లు. పెన్స్, స్టేషనరీ వ‌స్తుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పూలే సామాజిక తత్త్వవేత్త అని, ఉద్యమ కారుడు, సంఘ సేవకుడు అని అన్నారు. మనుషులు సర్వతోముఖాభివృధి చెందాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యమని చెప్పారు. దేశంలోని బహుజనులకు, మహిళలకు విద్యను ప్రోత్సహించినప్పుడే సర్వతోముఖాభివృధి సాధ్యమని భావించి వారి అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నతుడు పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకురాలు మెర్సీ, ఉపాధ్యాయురాలు శోభ, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మల్లేష్, కొక్కుల జనార్దన్, అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, చంద్రశేఖర్, సింగారయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here