పోషణ లోపం ఏ ఊరిలోనూ కనిపించకూడదు: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం, పోషణ్‌ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ శేరిలింగంపల్లి ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో 80 మంది అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ లు, 4 మంది దివ్యాంగులకు స్కూటీలను CDPO కవిత, మాజీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం, పోషణ్‌ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్ వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ లు, దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేయడం జరిగింద‌ని అన్నారు. సరైన పోషణ, ఆరోగ్య తెలంగాణ దిశగా పోషణ లోపం ఏ ఊరిలోనూ కనిపించకూడద‌నే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్‌వాడీ టీచర్లు మెరుగైన సేవలు అందించడానికి వీలుగా మొబైల్ ఫోన్ లు అందించడం జరిగింద‌ని తెలిపారు. ఈ మొబైల్ ఫోన్ ల‌ను సద్వినియోగం చేసుకోవాలని, సమాచార మార్పిడికి ఎంతగానో ఉపయోగపడ‌తాయ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునందన్ రెడ్డి, గంగాధర్, ప్రసాద్, అక్బర్ ఖాన్, నరేందర్ బల్లా, సూపర్ వైజర్లు కోమలి, మాధురి, జ్యోతి, నాగమణి, సువర్ణ, శ్రీలత, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here