శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): బీహెచ్ఈఎల్ లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టౌన్షిప్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి భెల్ ఈడీ శ్రీనివాసరావు ముఖ్య అథిధిగా హాజరై జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ అన్ని వర్గాల ప్రజలకు ఎనలేని సేవలను అందించారని అన్నారు. దేశభక్తికి, దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భెల్ జీఎంహెచ్ఆర్ సంధ్యాకర్, సెలబ్రేషన్ కమిటీ చైర్మన్ బిగన్న, అధికార యూనియన్ ప్రధాన కార్యదర్శి వినోద్, ఐఎన్టీయుసీ అధ్యక్షుడు రహమాన్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్, హరి సింగ్, నాగమోహన్, రవికిరణ్ గౌడ్, ఏసుదాస్, హరీష్ బాబు పాల్గొన్నారు.






