శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి, తన మిత్రులతో అన్ని కులాల వాళ్లను సమీకరించి, సొంత సైన్యాన్ని తయారు చేసుకుని, ఎన్నో కోటలను, దర్గాలను జయించి నిజాం లాంటి రాజులను గడగడలాడించిన వ్యక్తి సర్దార్ పాపన్న గౌడ్ అని అన్నారు. ప్రజలను తన కన్న బిడ్డల లాగా పాలించారని, ఖీల్లా షాపూర్ గ్రామంలో జన్మించిన సర్దార్ పాపన్న ముస్లిం పరిపాలనను ఎదిరించి ఎన్నో యుద్ధాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, సుభాష్, మనోజ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.






