శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల గ్రామ మాజీ సర్పంచ్ హరిశంకర్ గౌడ్ వర్ధంతి సందర్భంగా నల్లగండ్ల గ్రామంలో నియోజకవర్గం నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డి రాజు, శ్రీనివాస్ రెడ్డి, మన్నేపల్లి సాంబశివ రావు, కట్ల శేఖర్ రెడ్డి, సౌందర్య రాజన్, నర్సింగ్ రావు, బాలకృష్ణ, జగదీష్, ముజీబ్, శ్రీ కృష్ణ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






