ఘ‌నంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎం.ఐ.జి కాలనీలో శ్రీ రామాలయంలో జరిగిన శ్రీ హనుమాన్ విజయోత్సవం, 27 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు భారతి ఆదర్శ్ రెడ్డి, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ 27 అడుగుల శ్రీ అభయ ఆంజనేయస్వామి విగ్రహం ను ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందడం జరిగిద‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భీమ్ రెడ్డి, సత్యనారాయణ, టి.వి. రావు, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, నాగమణి, ఆదర్శ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి , సొసైటీ మాజీ డైరెక్టర్లు వెంకట్ రావు, నారాయణ గౌడ్, నీలకంఠం, రామచంద్రాపురం మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, నాయకులు కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి, సంపత్ గౌడ్, చిన్న, రాకేష్ రెడ్డి, కుమార్, భక్తులు, స్థానిక నాయకులు భాస్కర్ ముదిరాజ్, నరేందర్, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here