శేరిలింగంపల్లి, మార్చి 30 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునక్షత్ర పుట్టినరోజు సందర్భంగా విశ్వ శ్రేయస్సు కోసం ఏప్రిల్ 1వ తేదీన బుధవారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూకట్ పల్లి శ్రీ చిత్తారమ్మ దేవస్థానంలో శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు, శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహణ కమిటీ సభ్యులు వివరాలను వెల్లడించారు. కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరుతూ ఈ సందర్భంగా వారు కార్యక్రమానికి సంబంధించిన కర పత్రాన్ని ఆవిష్కరించారు.






