శేరిలింగంపల్లి, మార్చి 30 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి హిల్స్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం, సన్మానం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావును హెచ్ఎంటి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ హెచ్ఎంటి హిల్స్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, అన్ని కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






