మియాపూర్ డివిజన్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

శేరిలింగంప‌ల్లి, మార్చి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, ఆర్డిబి కోకనట్ గ్రో అపార్ట్మెంట్స్, శ్రీల గార్డెన్ కాలనీ, లక్షీ ఇంపీరియా అపార్ట్మెంట్స్, ఎ ఎస్ రాజు నగర్ కాలనీ, డీకే ఎనక్లేవ్ కాలనీ, కృషి నగర్ , ప్రశాంత్ నగర్ కాలనీ, మియాపూర్ విలేజ్, జయప్రకాష్ నారాయణ్ నగర్, ఎస్ ఆర్ ఫార్చ్యూన్ సిటీ అపార్ట్మెంట్స్, మక్తా మహబూబ్ పేట్ విలేజ్ ల‌లో నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన రోజు అని అన్నారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచి మనకు సత్యం, న్యాయం, నిబద్ధతతో జీవించడం ఎలా అనేది చూపించిన ఆదర్శమూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here