శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): మత్తు పదార్థాల బారిన పడితే భవిష్యత్తు నాశనం అవుతుందని, చిన్ననాటి నుంచే వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ విద్యార్థులకు సూచించారు. స్థానిక రాజీవ్ గృహకల్పలోని సంస్కృతి పాఠశాలలో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ వెంకటేష్ మాట్లాడుతూ తెలియని వయసులో కొందరు మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపం కాలుతుందని తెలిసి ఎవరూ తాకరు, అదే విధంగా మత్తు పదార్థాల జోలికి కూడా పోకూడదు అని విద్యార్థులకు స్పష్టంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, కానిస్టేబుళ్లు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






