పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను వెంట‌నే పూర్తి చేయాలి: డీసీ శ‌శిరేఖ

శేరిలింగంప‌ల్లి, మార్చి 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని మియాపూర్ స‌ర్కిల్ ప‌రిధిలో పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని డీసీ శ‌శిరేఖ సంబంధిత అధికారుల‌కు సూచించారు. మంగ‌ళ‌వారం స‌ర్కిల్ కార్యాల‌యంలో ఆమె ఆయా శాఖ‌ల‌కు చెందిన అధికారులు, సిబ్బందితో స‌మావేశం అయ్యారు. ఇందులో వాట‌ర్ వ‌ర్క్స్‌, విద్యుత్‌, యూబీడీ, ఇంజినీరింగ్‌, రోడ్లు, ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయా విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌పై ఆమె ఆరా తీశారు. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 91 ప‌నులు పెండింగ్‌లో ఉండ‌గా, జ‌ల‌మండ‌లిలో 64, విద్యుత్ 25, గృహ నిర్మాణం 76, ఇత‌ర ప‌నులు 120, గ్రీన్ వేస్ట్‌లో భాగంగా విద్యుత్‌లో 17, యూబీడీలో 2, గృహ నిర్మాణం 7 మొత్తం క‌లిపి ఇందులో 40 ప‌నులు పెండింగ్‌లో ఉన్న‌ట్లు తెలిపారు. అన్ని విభాగాల‌కు చెందిన అధికారులు, సిబ్బంది త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను స‌త్వ‌ర‌మే పూర్తి చేయాల‌ని అన్నారు. ప‌నుల‌ను త‌ర‌చూ ప‌ర్య‌వేక్షించ‌డం జ‌రుగుతుంద‌ని, అన్ని విభాగాల‌కు చెందిన అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి నిర్ణీత స‌మ‌యంలోగా ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here