భ‌గ‌త్ సింగ్‌కు కాంగ్రెస్ నాయ‌కుల ఘ‌న నివాళి

శేరిలింగంప‌ల్లి, మార్చి 22 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా స్టీఫెన్ తోపాటు ఆయ‌న సన్నిహితుల ఆధ్వర్యంలో పీజేఆర్ స్టేడియంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. పీజీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేసి సేవా త‌త్ప‌ర‌త‌ను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్, మాదాపూర్ మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, టీపీసీసీఎం ర‌ఘునంద‌న్ రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ హరికృష్ణ, ఓబీసీ స్టేట్ సెక్రటరీ రాజన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు K. శంకర్ రెడ్డి, M. ప్రీతమ్, మౌళి, NSUI శేరిలింగంపల్లి ప్రతినిధి, డివిజన్ సెక్రటరీ ఎండీ అజామ్, ఐవైసీ డివిజన్ ప్రెసిడెంట్ కొడిచర్ల మహేందర్, కాంగ్రెస్ యువజన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here