శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హఫీజ్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ తన నివాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఓల్డ్ హఫీజ్ పేటలోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిలువుటద్దమని పేర్కొన్నారు. మన ప్రాంతం గంగా-జమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీక అని అన్నారు.






