శేరిలింగంపల్లి, మార్చి 14 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏకీగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పేరి వెంకటరెడ్డిని మయూరి నగర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో సన్మానించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ఐక్యవేదిక తాత్కాలిక అధ్యక్షుడు కే కోటయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక సభ్యులు పాల్గొని పేరి వెంకట రెడ్డి ఉపాధ్యాయ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి భవిష్యత్తులో ఇలాగే పనులు చేస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక నాయకులు, మయూరి నగర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.






