శేరిలింగంపల్లి, మార్చి 13 (నమస్తే శేరిలింగంపల్లి): మన భవిష్యత్తు తరాలకు ఆస్తులు కాదు మంచి ఆరోగ్యం, ప్రశాంత జీవితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని చెరువుల అభివృద్ధి కోసం PAC ఛైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో CSR నిధులతో ది లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మక్తా మహబూబ్ పేట్ డివిజన్ పరిధిలోని పెద్ద కుడి చెరువు సుందరీకరణలో భాగంగా స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలో భాగంగా చేపట్టిన సుందరీకరణ, పునరుద్ధరణ పనులను మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులతో కలసి ఉమ్మడి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని చెరువుల అభివృద్ధితో దశ దిశ మారడం జరుగుతుందని అన్నారు. మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం, అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం, పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్, చెరువు సంరక్షణలో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం, చెరువు అలుగు నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులు రామ్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.






