శేరిలింగంపల్లి, మార్చి 13 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్ లో ఉన్న మసీదు వద్ద జరిగిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లింలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ పండుగను అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం దుస్తులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మైనారిటీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జంగయ్య యాదవ్, రాంచందర్, గౌస్ పటేల్, నిజాం, సర్వర్, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.

చందానగర్లో..
రంజాన్ మాసంను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీలో ఉన్న మసీదు వద్ద జరిగిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లింలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, నాయకులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మిరియాల ప్రీతం, నరేందర్ బల్లా, అంజద్, ప్రవీణ్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.






