ఏవీఆర్, ఎన్ఎంఆర్ అపార్ట్మెంట్ యజమానులకు అండగా ఉంటాం: కసిరెడ్డి సింధూరెడ్డి

శేరిలింగంప‌ల్లి, మార్చి 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఏవీఆర్ & ఎన్ఎంఆర్ అపార్ట్మెంట్ యజమానులకు అండగా ఉంటామని బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, చందానగర్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూరెడ్డి అన్నారు. అసోసియేషన్ ఆహ్వానం మేరకు అపార్ట్మెంట్ సముదాయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చందానగర్ ప్రాంతంలోని కొన్ని అసాంఘిక శక్తులు బెదిరింపులకు పాల్పడ్డాయని, చట్టప్రకారం వారిని ఎదుర్కొని ఫ్లాట్స్ యజమానులకు అండగా ఉంటామని హెచ్చరించారు. బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని కసిరెడ్డి సింధూరెడ్డి అన్నారు. బిల్డర్లు కూడా తమ నాణ్యతతో నిర్మాణాలు చేసి కొనుగోలు దారుల మనసులు చూరగొనాలని కసిరెడ్డి సింధూరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అఖిల్, కార్తీక్, రవిచంద్ర, రవీంద్ర, సతీష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here