శేరిలింగంపల్లి, మార్చి 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని సీఐ ప్రశాంత్ తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో మియాపూర్ మెట్రో పిల్లర్ నం.602 నుంచి మియాపూర్ ఎక్స్ రోడ్డు వరకు సీసీ రోడ్డు వేయడం జరిగిందని తెలిపారు. దీని వల్ల ట్రాఫిక్ సజావుగా సాగుతుందని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.






