శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ నివాళులు అర్పించారు. సాంబశివరావు నివాసంలో ఆయన పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావుతో కలిసి గాంధీ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కావూరి సాంబశివరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కావూరి సాంబశివరావు మృతి చెందడం చాలా బాధకరమైన విషయం అని, ఆయన మరణం తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.






