రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధిగా రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రవి కుమార్ యాదవ్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ త‌న‌పై నమ్మకం ఉంచి పార్టీలో ఉన్నతమైన బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్ర రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మరింత రెట్టింపు ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు గాని హామీలపై, నిరుపేదలకు ఇస్తానన్న ఇందిరమ్మ ఇండ్లపై శుక్రవారం ఉదయం 10 గంటలకు మండల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ లకు, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అక్కడికి రావాలని కోరారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జయప్రదం చేయాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here