సరస్వతి విద్యా మందిర్ నూతన పాలకవర్గం ఏకగ్రీవ ఎన్నిక

శేరిలింగంప‌ల్లి, మార్చి 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని చందాన‌గ‌ర్‌లో ఉన్న సరస్వతి విద్యా మందిర్ నూతన పాలకవర్గాన్ని గురువారం ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీకి అధ్యక్షుడిగా వంగల్లు రామచంద్ర రెడ్డి, ఉపాధ్యక్షుడిగా కాశిరెడ్డి సుదీప్ రెడ్డి, కార్యదర్శిగా మూగల రఘునందన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా మాకినేని నరేంద్ర ప్రసాద్, ట్రెజరర్ గా గౌరిశెట్టి నాగభూషణరావు ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా కాశిరెడ్డి శ్రీపాల్ రెడ్డి, పులిపాటి ధీరజ్ కుమార్, పి.వి. దుర్గామహేశ్వర రావు, సలహాదారుగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు పాఠశాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదల తదితర అంశాలపై చర్చించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here