శేరిలింగంపల్లి, మార్చి 10 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) శేరిలింగంపల్లి మండల కౌన్సిల్ ఆధ్వర్యంలో కొత్తగూడ, కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ నుంచి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ క్రమశిక్షణతో పరీక్షలు రాయాలని , మంచి మార్కులతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఎగ్జామ్ ప్యాడ్స్ , పెన్ను, పెన్సిల్ ,స్కేల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి మండల అధ్యక్షుడు టి.నితీష్, కార్యదర్శి జె.ధర్మతేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దుర్గాప్రసాద్, హరి హరన్ , ఆదిత్య పాల్గొన్నారు.






