శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్లోని గౌతమి నగర్ కాలనీలో ఉన్న శ్రీ తుషాల్ ప్లే స్కూల్ 19వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ప్లేస్కూల్ నిర్వాహకురాలు లక్ష్మీ మాజీ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని సన్మానించారు. వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తు నిర్మాణంలో ప్రీ-స్కూల్ విద్య ఎంతో కీలకమని తెలిపారు. పిల్లలలో ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కాలనీ వాసులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






