శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్–48 పరిధిలోని మదీనాగూడ డివిజన్ ప్రాంతాల్లో రోడ్ల పై చెత్త పారవేయకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమ ఇళ్ల ముందు శుభ్రం చేసుకోవాలని, చెత్తను రోడ్ల పై వేయకుండా చెత్త బండి (ఆటో)లోనే వేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత అని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో GCMC, C-48 ప్రత్యేక అధికారి DEE వశీ కుమార్, గంగారెడ్డి, స్థానిక నాయకుడు పవన్, స్థానిక మహిళలు, మియాపూర్ సర్కిల్ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.






