నీటిని పొదుపుగా వాడుకోవాలి: బేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప‌్ర‌జ‌లు నీటిని పొదుపుగా వాడుకోవాల‌ని, నీళ్ల‌ను అస‌లు వృథా చేయ‌కూడ‌ద‌ని నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ అన్నారు. వేస‌వికాలం నేప‌థ్యంలో నీటి పొదుపుపై ఆయ‌న కాల‌నీ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మిషన్ భ‌గీర‌థ క‌నెక్ష‌న్‌కు ప్ర‌తి ఒక్క‌రు ట్యాపుల‌ను అమ‌ర్చుకోవాల‌ని, నీళ్ల‌ను వృథా పోనివ్వ‌కూడ‌ద‌ని అన్నారు. వేస‌వి కాలంలో నీటి ఎద్ద‌డి సంభ‌వించే అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. నీటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here