శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డి.శశిరేఖ, రెవెన్యూ సెక్షన్ ఏఎంసీ విజయ్ కుమార్, టీపీఎస్ రమేష్, డీఈ (ఎస్‌డబ్ల్యూఎం) వశీధర్, ఏఎంవోహెచ్ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఎస్ శ్రీనివాస్, ఎఫ్ఎస్‌వో శృతి గౌడ్, ఇంజినీరింగ్ సెక్షన్ ప్రశాంత్, ఎంటమాలజీ సెక్షన్ బాలగౌడ్, వెటర్నరీ సెక్షన్ గీత, యూబీడీ సెక్షన్ సతీష్, యూసీడీ సెక్షన్ వీణ, ఎలక్ట్రికల్ సెక్షన్ శివ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజావాణిలో పలు ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఇంజినీరింగ్ సెక్షన్‌లో 4 ఫిర్యాదులు రాగా, టౌన్ ప్లానింగ్ లో 13 వచ్చాయి. మొత్తం 17 ఫిర్యాదులు అందాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని డీసీ శశిరేఖ తెలిపారు. ఈ మేరకు ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.






