లక్ష్మి ఇంపీరియా అపార్ట్మెంట్ వాసులతో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స‌మావేశం

శేరిలింగంప‌ల్లి, మార్చి 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చెయ్యాలి తప్ప అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు రావాలని ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజన్ లక్ష్మి ఇంపీరియా అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటు చేసిన స‌మావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ చ‌దువుకున్న వ్య‌క్తులు దేశ అబివృద్ధికి, స‌మాజంలో మార్పు తెచ్చేందుకు పాటు ప‌డాల‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌తి ఒక్క‌రు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా క‌మ్యూనిటీ వాసులు ప‌లు స‌మ‌స్య‌ల‌ను వారి దృష్టికి తీసుకురాగా వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు శివ నరసింహ రాజు, సుబ్బారావు, శంకర్ , ఆనంద్, నవీన్ రెడ్డి , మధుకర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు రాఘవేందర్ రావు, నాగుల్ గౌడ్, సీతారామరాజు, మాణిక్ రావు, లక్ష్మణ్ ముదిరాజ్, పట్టాభిరామ్, మాన్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here